Healthhealth tips in telugu

ఈ జావ తాగితే… డయాబెటిస్, నీరసం, అలసట, నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు

Barly Java Home remedies In telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు రావటం అయితే చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గాలంటే చాలా సమయం పట్టేస్తుంది.
Barli benefits
అయితే ఏ సమస్య అయినా ప్రారంభంలో ఉంటే మాత్రం కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ రోజు బార్లీ జావ గురించి తెలుసుకుందాం. దీని కోసం మనం 3 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. మూడు మనకు ఇంటిలో అందుబాటులో ఉండేవే. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు బార్లీ గింజలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగించాలి.

వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ పొడి వేసి జావ కాయాలి. ఈ జావను ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు తాగాలి.
jeelakarra Health Benefits in telugu
ఆ తర్వాత వారం రోజులు గ్యాప్ ఇచ్చి మరల పది రోజులు తాగాలి. ఈ జావ తాగితే తక్షణ శక్తి వస్తుంది. బార్లీలోని మాంగనీస్ నాడీ వ్యవస్థను కూడా శాంతపరుస్తుంది. అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అమైనో ఆమ్లాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి కూడా బాగా సహాయపడుతుంది.
Diabetes diet in telugu
డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా నీరసం,అలసట లేకుండా చేస్తుంది. రోజంతా ఉషారుగా ఉంటారు. చెడు కొలెస్ట్రాల్ సమస్య లేకుండా చేస్తుంది. కాబట్టి బార్లీ జావను తయారుచేసుకొని తాగటానికి ప్రయత్నం చేయండి. కాస్త సమయాన్ని కేటాయిస్తే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.