ఉదయం తాగితే నరాల బలహీనత, నీరసం, అలసట, నిసత్తువ అనేవి అసలు ఉండవు

Fatigue Energy Drink in Telugu : సర్వ సాధారణంగా మనలో చాలామందిని వేధించే సమస్యలలో నీరసం ప్రధానంగా చెప్పుకోవచ్చు. నీరసం వచ్చిందంటే అంత సులభంగా తగ్గదు. నీరసంగా ఉన్నప్పుడు ఏ పని చేయాలని అనిపించదు. చాలా నిస్సత్తువుగా ఉంటుంది. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే .నీరసం, అలసట, నిస్సత్తువ తగ్గి రోజంతా హుషారుగా పనులను చేసుకుంటారు.
Fig Fruit Benefits in telugu
అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం చాలా సులువు. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఒక బౌల్ లో రెండు అంజీర్ పండ్లు, పది పిస్తా పప్పులు, రెండు స్పూన్ల ఎండుద్రాక్ష, రెండు వాల్నట్స్ వేసి నీటిని పోసి 5 గంటల పాటు నానబెట్టాలి.
Is pista good for diabetes In Telugu
మరొక బౌల్ లో ఆరు బాదం పప్పులు వేసి నీటిని పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. మరొక బౌల్ లో గింజు తీసిన ఖర్జూరాలు రెండు వేసి నీటిని పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత బ్లెండ‌ర్‌ తీసుకుని దానిలో నానబెట్టిన అంజీర్, పిస్తా పప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు వేయాలి. ఆ తర్వాత నానపెట్టిన బాదంపప్పును తొక్క తీసి వేయాలి.
black raisins
ఆ తర్వాత ఒక గ్లాసు సోయా పాలు లేదా బాదంపాలు లేదా గేదె పాలు లేదా ఆవు పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే నీరసంను తగ్గించే డ్రింక్ రెడీ అయినట్టే. ఈ డ్రింక్ ను బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే నీరసం, అలసట లేకుండా రోజంతా హుషారుగా చురుకుగా ఉంటారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా సమృద్ధిగా అందుతుంది. .
Health Benefits of Dates
మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి. కాబట్టి మన శరీరానికి అవసరమైన పోషకాలు అందాలంటే తప్పనిసరిగా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం.
Diabetes patients eat almonds In Telugu
ఈ డ్రింక్ తీసుకోవడం వలన బరువు తగ్గటానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నీరసం., అలసట, నిస్సత్తువ వంటి సమస్యల నుంచి బయట పడటమే కాకుండా నరాల బలహీనత, శారీరక బలహీనత వంటి సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేయటానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ డ్రింక్ తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.