MoviesTollywood news in telugu

Suswagatham సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?

Suswagatham Full Movie : పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా రఘువరన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించిన సుస్వాగతం మూవీ అప్పట్లో క్లాసికల్ హిట్ మూవీ. భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1998 జనవరి 1న విడుదలైంది. యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చిన ఈ మూవీ క్లైమాక్స్ లో పవన్ డైలాగ్స్ ఎమోషనల్ గా ఉంటాయి. ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతం అలరిస్తుంది.

సుస్వాగతంతో పాటు ఓ పనైపోతుంది బాబూ మూవీ వచ్చింది. శివ నాగేశ్వరరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రవితేజ, సురేష్ హీరోలు. అయితే విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీకి 6రోజుల ముందు డిసెంబర్ 26న జపతిబాబు, రాశి జంటగా నటించిన పెళ్లిపందిరి మూవీ వచ్చింది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మంచి లవ్ స్టోరీ. వందేమాతరం శ్రీనివాసరావు సంగీతం అందించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

జనవరి 14న సూపర్ స్టార్ కృష్ణ, సుమన్ నటించిన సంభవం మూవీ వచ్చింది. రోజా హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏ మోహన్ గాంధీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. ఇదేరోజు మోహన్ బాబు నటించిన ఎమోషనల్ మూవీ ఖైదీ గారు వచ్చింది. ఇదీ నిలబడలేదు.

అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో శ్రీకాంత్, రమ్యకృష్ణ, సుహాసిని నటించిన ఊయల మూవీ ఏవరేజ్ అయింది. ఇక నాగార్జున, టబు జంటగా నటించిన ఈ ఆవిడా మా ఆవిడే మూవీ ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చింది. మూవీ హిట్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."