Healthhealth tips in teluguKitchen

డయాబెటిస్ ఉన్నవారు ఉదయం ఉడికించిన గుడ్డు తింటే… ఏమి అవుతుందో తెలుసా ?

Boiled eggs for diabetes :డయాబెటిస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వేసుకోవాలి.
Diabetes In Telugu
అలా మందులు వేసుకుంటూ డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ అనేది సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి వచ్చిన తర్వాత మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఆహారం విషయంలో కూడా చాలా నియంత్రణ అవసరం. డయాబెటిస్ ఉన్నవారు తక్కువ కార్బోహైడ్రేట్లు మరియు మంచి కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెప్పుతున్నారు.
Egg Benefits
ఇలా తీసుకోవటం వలన రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఉడికించిన ఒక Egg తినమని నిపుణులు చెప్పు తున్నారు. ఉడికించిన గుడ్డు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది. అలాగే డయాబెటిస్ లేనివారు తింటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
Diabetes diet in telugu
డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే సమస్యలను కూడా Egg తగ్గిస్తుంది. గుడ్లులో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన నరాలు మరియు కండరాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడి రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Eat Egg Yellow
Egg లో లుటిన్ మరియు కోలిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. లుటీన్ కంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది మరియు కోలిన్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుడ్డు సొనలో బయోటిన్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అయితే రోజు కాకుండా రోజు విడిచి రోజు ఒక ఉడికించిన Egg ని తినాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.