Healthhealth tips in telugu

ఈ పొడిని నీటిలో కలిపి తాగితే చాలు కాళ్లు, చేతుల తిమ్మిర్లు నిమిషంలో తగ్గుతాయి

Tingling sensation : మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో కాళ్ళు, చేతులలో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఒకే చోట ఎక్కువ సమయం కూర్చోవటం వలన ఆయా బాగాలలో రక్తప్రసరణ సరిగ్గా జరగక తిమ్మిర్లు వస్తాయి. ఇలా ఎప్పుడో ఒక్కసారి వస్తే పర్లేరు. కానీ తరచుగా వస్తే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి. అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి.
Tingling Home Remedies
డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలిపి రాత్రి పడుకొనే ముందు తాగితే తిమ్మిర్లు తగ్గుతాయి. మధ్యాహ్నం సమయంలో ఒక కప్పు పెరుగు తింటే కూడా తిమ్మిర్ల సమస్య రాదు.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సం సాల్ట్ వేసి ఆ నీటిని తిమ్మిర్లు వచ్చిన చోట పోస్తే త్వరగా తగ్గిపోతాయి. అలాగే రోజు స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఎప్సం సాల్ట్ వేసి స్నానం చేస్తే తిమ్మిర్లు రాకుండా ఉంటాయి. కొంతమందికి రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళు,చేతులు తిమ్మిర్లు వస్తాయి.

అలాంటి వారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఈ విధంగా తాగితే తిమ్మిర్లు తగ్గుతాయి. అలాగే రాత్రి పడుకోవటానికి ముందు కాళ్ళు,చేతులకు ఆలివ్ ఆయిల్ రాసి మసాజ్ చేసుకుంటే శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి తిమ్మిర్లు రాకుండా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.