Healthhealth tips in telugu

డయాబెటిస్ ఉన్నవారికి ఈ పొడి దివ్య ఔషధం…పంచదారకు బదులు ఈ పొడి వాడితే ఏమి అవుతుంది

Coconut Sugar: ఆరోగ్యకరమైన జీవిన విధానాన్ని సాగించాలంటే మంచి ఆహారాలను తీసుకోవాలి. చాలామంది పంచదారకు బదులుగా బెల్లంను వాడుతున్నారు. అయితే పంచదారకు బదులుగా కోకోనట్ షుగర్ వాడవచ్చు. చాలా మందికి కోకోనట్ షుగర్ గురించి పెద్దగా తెలియదు. దీనిని కొబ్బ‌రికాండం నుంచి తీసిన ప్ర‌త్యేక ద్ర‌వంతో త‌యారు చేస్తారు. దీనిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
coconut sugar
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. డయాబెటిస్ ఉన్నవారు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకుంటేనే మంచిది. ప్రతి రోజు ఉపయోగించే పంచదారలో గ్లైసీమిక్ ఇండెక్స్ 60 నుంచి 65 శాతం ఉంటుంది. అదే అదే కోకోనట్ షుగర్ లో అయితే కేవలం 35 శాతం మాత్రమే ఉంటుంది. దీంట్లో ఇన్సులిన్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల గ్లూకోస్ లెవెల్స్ ని తక్కువ చేస్తుంది.
Diabetes diet in telugu
డయాబెటిస్ రాక ముందు నుంచి తీసుకుంటే డయాబెటిస్ రాకుండా ఉండవచ్చు. కోకోనట్ షుగర్ వాడితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలో ఉండే విట‌మిన్ సి, నైట్రోజ‌న్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

కోకోనట్ షుగర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్యూస్ లో కలిపి తీసుకోవచ్చు.పాలల్లో, టీ, కాఫీ లలో కలిపి తీసుకోవచ్చు. కానీ ఒకటి రెండు స్పూన్ల మించి తీసుకోకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.