Healthhealth tips in telugu

30 సంవత్సరాలుగా తగ్గని డయాబెటిస్ వ్యాధిని తగ్గించే అద్భుతమైన ఆకు

Bay Leaf diabetes : బిర్యానీ ఆకు అంటే మనలో చాలామందికి ఒక మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. కానీ ఈ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ మరియు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఈ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. డయాబెటిస్ ఉన్న వారిలో.చక్కెర స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.
Biryani leaves health benefits In Telugu
ఈ ఆకులలో ఉన్న పోషకాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను,చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడటనే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఈ ఆకులలో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీబయాటిక్స్ సమ్మేళనాలు ఉండటం వల్ల ప్రతిరోజు ఈ ఆకును కషాయంగా చేసుకుని తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
Diabetes In Telugu
ఈ ఆకులలో టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, లినోలియోల్, యూజినాల్, ఆంథోసైనిన్స్ మరియు మిథైల్ కీచైన్ వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. బిర్యానీ ఆకులో విటమిన్ ఎ, ప్రొటీన్, ఐరన్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, కాపర్, జింక్, సెలీనియం, మాంగనీస్ మరియు ఫోలేట్ వంటి కొన్ని ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి.
Bay Leaf
శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్యాంక్రియాటిక్ బీటా కణాలను దెబ్బతీస్తాయి. అలాగే హైపర్ గ్లైసిమియాకు దారి తీస్తుంది . ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తికి బాధ్యత వహిస్తుంది, ఇది శరీరం గ్లూకోజ్‌ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే ప్యాంక్రియాటిక్ బీటా కణాలు నాశనం అయినప్పుడు, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు.
Diabetes symptoms in telugu
బిర్యానీ ఆకు దెబ్బతిన్న బీటా కణాల నుండి ఇన్సులిన్ విడుదలను ప్రోత్సహిస్తుంది. మరియు పెరిగిన ఇన్సులిన్ లభ్యతతో సంబంధం కలిగి ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల క్లోమగ్రంధికి హాని జరగకుండా కూడా నివారిస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసు నీటిని పోసి ఒక బిర్యానీ ఆకును చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసి 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.