Healthhealth tips in telugu

ఈ పిండి అందరికీ తెలుసు…కానీ ఈ పిండిలో ఉన్న ఆ రహస్యం మాత్రం ఎవరికి తెలియదు

Jonna Pindi benefits : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరు శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకునే మార్గాల కోసం అన్వేషణ చేస్తూ వాటిని పాటిస్తున్నారు. మన పెద్దలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కోసం జొన్నలు వంటి చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకునేవారు. మరల ఇప్పుడు ఆ చిరుధాన్యాలను తీసుకోవటం ఎక్కువయింది.

ఈరోజు జొన్న పిండి గురించి తెలుసుకుందాం. జొన్న పిండిలో ఫైబర్ మెగ్నీషియం,calcium, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. calcium, మెగ్నీషియం అనేవి ఎముకలకు బలాన్ని అందిస్తాయి.
Jonna pindi
డయాబెటిస్, రక్తపోటు ఉన్నవాళ్లు జొన్న పిండితో రొట్టెలు తింటే చాలా మంచిది. ఇతర ధాన్యాలతో పోలిస్తే జొన్న లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరం లో ఎర్ర రక్త కణాల అభివృద్ధికి సహాయపడి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. వారంలో రెండు సార్లు జొన్న పిండిని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది.

పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జొన్న పిండి మార్కెట్ లో దొరుకుతుంది. లేదా జొన్నలను తెచ్చుకొని పిండిగా చేసుకోవచ్చు. జొన్నల పిండితో రొట్టె తయారుచేసుకొని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."