వేసవికాలంలో నోటి పూత వేధిస్తోందా… ఈ చిట్కాలు నీకోసమే
Mouth ulcers In Telugu :వేసవి కాలం ప్రారంభం అయింది ఎండలు పెరిగిపోయాయి ఈ వేసవి కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య లో నోటిపూత ఒకటి. నోటి పూత వచ్చింది అంటే భరించలేని నొప్పి మంట ఉంటాయి. నోటిపూత వచ్చినప్పుడు ఆహారం తీసుకోవాలన్న ఏమైనా ద్రవాలు తీసుకోవాలి అన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే కొన్ని చిట్కాలు ఫాలో అయితే నోటి పూత నుంచి బయట పడవచ్చు.
నోటి పూత సమస్య ఉన్నప్పుడు కొబ్బరి నీటిని తాగాలి అలాగే ఎండుకొబ్బరిని నములుతూ ఉండాలి. నోటి పూత ఉన్న ప్రదేశంలో కొబ్బరి నూనె రాయాలి
తరచుగా మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగ శరీరంలో వేడిని తగ్గించి నోటిపూతను తగ్గిస్తుంది.
గసగసాలు కూడా నోటిపూతను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. గసగసాలను నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసి నీటిలో కలిపి తాగుతూ ఉండాలి.
తులసి ఆకులను నములుతూ ఆ రసాన్ని మింగాలి. తులసి ఆకులలో ఉన్న లక్షణాలు నోటిపూతను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.