MoviesTollywood news in telugu

నాగార్జున సినీ కెరీర్ లో తిరుగులేని రోజులివి…తెలియకపోతే వెంటనే చూసేయండి

Akkineni Nagarjuna:అక్కినేని నటవారసునిగా విక్రమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మరోపక్క ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ లను కూడా ఎంట్రీ ఇప్పించేసాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని టాప్ స్టార్ గా నిలబడ్డాడు. 1989లో గీతాంజలి, శివ మూవీ తర్వాత టాప్ రేంజ్ కి చేరిన నాగ్ 1992నుంచి 1997వరకూ తిరుగులేని హీరోగా నిలిచాడు.
Nagarjuna
హీ ఈజ్ నెంబర్ వన్ అంటూ ఫిలిం ఫేర్ లో వార్తలొచ్చాయి. ఇక ఓ రేంజ్ లో అయితే టాప్ టెన్ లో 5మూవీస్ నాగార్జునవే ఉండడం రేర్. 1992లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం టాప్ 4లో నిలిస్తే మిగిలిన సంవత్సరాల్లో నాగ్ మూవీస్ టాప్ త్రి లో ఉన్నాయి. మూడు సార్లు టాప్ వన్ గా ఉండడం మరో రికార్డ్. నిజానికి శివ తర్వాత అన్నీ ప్లాప్ లే. నిర్ణయం మూవీ ఏవరేజ్ మినహా హిట్ పడలేదు. 1992లో సంక్రాంతికి వచ్చిన కిల్లర్ మూవీ తొలివారం కోటి రూపాయలు కలెక్ట్ చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చింది.
Bigg Boss 5 Telugu Nagarjuna
చంటి లాంటి ఇండస్ట్రీయల్ హిట్ తో పోటీ పడుతూ కమర్షియల్ గా సక్సెస్ అయ్యి వందరోజులు ఆడింది. తర్వాత అంతం మూవీ తొలివారం కోటి ముప్పై లక్షలు వసూలు చేసింది. ప్లాప్ అయినప్పటికీ ఇంతమొత్తం కలెక్ట్ చేయడం రికార్డ్. తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సూపర్ హిట్ కొట్టి మాస్ లో కూడా కొత్త ఫాన్స్ ని తెచ్చింది. తర్వాత వచ్చిన రక్షణ మూవీ నటన బాగున్నా సినిమా ఆడలేదు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ తో కల్సి చేసిన వారసుడు సూపర్ హిట్ కొట్టి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

అదే ఏడాది అల్లరి అల్లుడు సూపర్ హిట్ కొట్టి టాప్ గ్రాస్ గా నిల్చింది. ఈ రెండు సినిమాలు 7కోట్లు కలెక్ట్ చేశాయి. 1994లో వచ్చిన గోవిందా గోవిందా డిజాస్టర్ అయినా, ఓపెనింగ్స్ అదరగొట్టింది. తర్వాత హలొ బ్రదర్ 9కోట్లు వసూలు చేసి జస్ట్ ఇండస్ట్రీ హిట్ మిస్సయింది. 1994లో టాప్ గ్రాసర్ గా నిల్చింది. తర్వాత క్రిమినల్ యావరేజ్ గా నిల్చినా టెక్నీకల్ గా పేరొచ్చింది. 1995లో ఘరానా బుల్లోడు మాస్ హిట్ గా నిల్చి, సిసింద్రీ మూవీ అందరిని అలరించి హిట్ మూవీ అయింది. రాముడొచ్చాడు యావరేజ్ గా నిల్చింది.

1996లో నిన్నే పెళ్లాడతా మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది. టాప్ గ్రాసర్ గా నిల్చి ఇమేజ్ రెట్టింపు చేసింది. 1997లో స్టార్ గానే కాదు నటుడిగా ఇమేజ్ తెచ్చిన మూవీ అన్నమయ్య నిల్చింది. భక్తి మూవీ 42కేంద్రాల్లో వందరోజులు 10కోట్ల షేర్ అంటే నిజంగా గ్రేట్. తర్వాత వచ్చిన రాక్షుకుడు మూవీకి రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని భారీ అంచనాలతో విడుదలై ప్లాప్ అయింది.