Corn Benefits:ఈ సీజన్ లో మొక్కజొన్న తింటున్నారా…ముఖ్యంగా కాల్చిన వాటిని…ఊహించని ప్రయోజనాలు
Mokkajonna Benefits:వానాకాలంలో ఒక వైపు వర్షం పడుతుంటే వేడివేడిగా ఉండే పదార్థాలు తింటే ఆ మజాయే వేరు. ఈ సీజన్లో ఎక్కువగా కాల్చిన మొక్కజొన్న కంకులను తినటానికి ఇష్టపడతారు. కొంతమంది ఉడికించిన స్వీట్ కార్న్ తింటే.. మరి కొంత మంది నిప్పులపై కాల్చిన వేడివేడి మొక్కజొన్న కంకులను తింటూ ఆస్వాదిస్తూ ఉంటారు.
నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకులలో ఊహించిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్, రెండు గ్రాముల ఫ్యాట్, 55 మిల్లీగ్రాముల ఐరన్, నాలుగు గ్రాముల ప్రోటీన్లు, 125 క్యాలరీలు ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ కార్న్ తినడం కన్నా నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకులను తింటేనే మంచిది.
దీనిలో బి12 సమృద్ధిగా ఉండటం మరియు పోలిక్ యాసిడ్, ఐరన్ కూడా సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి బిడ్డ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. తక్కువ బరువు ఉన్నవారు తింటే బరువు పెరుగుతారు.
మొక్కజొన్నలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు ఏమి ఉండవు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు ఏమి రావు. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి.కాబట్టి నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకులను తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

