Healthhealth tips in telugu

Bay Leaf Burn:బిర్యానీ ఆకును ఇంటిలో కాల్చుతున్నారా…అయితే ఈ విషయం తెలుసుకోండి

Bay Leaf Burn:బిర్యానీ ఆకును సాదారణంగా మసాలా వంటల్లో వాడుతూ ఉంటాం. బిర్యానీ ఆకులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆ విషయం మనలో చాలా మందికి తెలియదు. దాంతో అది ఒక మసాలా అకుగానే భావిస్తారు. అయితే ఈ ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే చాల ఆశ్చర్యం కలుగుతుంది.

మనస్సుకు ప్రశాంతత కలగటానికి మనం ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సువాసనలను పీల్చినప్పుడు మనస్సుకు ప్రశాంతంగా అన్పిస్తుంది. ఈ విధంగా వాసనల ద్వారా రుగ్మతలను తగ్గించే ప్రక్రియను ‘అరోమా థెరపీ’ అని అంటారు.

అయితే మనం వంటల్లో ఉపయోగించే ఒక రకమైన ఆకును కాల్చి పీల్చటం ద్వారా కూడా మనస్సు ప్రశాంతత కలుగుతుంది. అది బిర్యానీ ఆకు. బిర్యానీ తినేవారికి ఈ ఆకు సుపరిచితమే. ఈ ఆకును బిర్యానీలో ఉపయోగించటం వలన బిర్యానీకి ఒక రకమైన రుచి ,వాసన వస్తాయి. రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని ఒక గదిలో కాల్చండి.

దీంతో వాటి నుంచి పొగ వస్తుంది. ఈ సమయంలో గది నుంచి బయటికి వెళ్లి తలుపులు మూసేయండి .ఆ విధంగా ఒక 10 నిమిషాల పాటు తలుపులను మూసి ఉంచండి. దాంతో ఆ పొగ అంతా గదిలో బాగా వ్యాపిస్తుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్లి చూడండి. మంచి వాసన వస్తుంది. ఆ వాసనను పీల్చండి.

దాంతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయం అవుతుంది. అంతేకాదు గది అంతా సువాసనా భరితంగా ఉంటుంది. దోమల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."