Healthhealth tips in telugu

Know about Ivy Gourd: మతిమరుపు వస్తుందని దొండకాయ తినట్లేదా? అయితే ఇది చదవండి..

Dondakaya Benefits In telugu : మార్కెట్ లో సంవత్సరం మొత్తం విరివిగా దొరికే కూరగాయల్లో దొండకాయ ఒకటి. చూడటానికి చిన్నగా పొట్టిగా కనిపించే దొండకాయను పోషకాల విషయంలో తక్కువ అంచనా వేస్తె పొరపాటు పడినట్టే. దొండకాయను కూరగాను, పులుసుగాను, వేపుడుగాను ఇలా రకరకాలుగా వండుకోవచ్చు. దొండకాయలో బీటాకెరోటిన్, అధిక ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఉంటాయి.

దొండకాయ మధుమేహం ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవాళ్లు కూడా దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకూ రాకుండా నియంత్రిస్తుంది. దొండకాయలో ఉండే విటమిన్ బి నాడీవ్యవస్థకు చాలా మేలు చేయటమే కాకుండా అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

దొండను ఎక్కువగా తింటే మందబుద్ధి వస్తుంది అని చాలా మంది అనటం మనం వింటూ ఉంటాం. దీనిలో ఎంత మాత్రం నిజం లేదు. ఇది ఒక అపోహ మాత్రమే. మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది. దొండకాయలో రిబోఫ్లేవిన్‌ సమృద్ధిగా ఉండుట వలన మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ తగ్గడానికి దోహదం చేస్తుంది.

యాంటీ బ్యాక్టీరియల్ గుణాల ద్వారా ఇన్ఫెక్షన్లు  దూరమవుతాయి. దొండకాయలో ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. అదేసమయంలో ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది. బరువు తగ్గాలని అనుకుంటున్నవారు రెగ్యులర్ గా దొండకాయను తింటే మంచి ఫలితం కనపడుతుంది. శరీరంలో ఐరన్ శాతం తగ్గితే నీరసం, అలసట,అనీమియా వంటి సమస్యలు వస్తాయి .

ఈ సమస్యలు తగ్గాలంటే ఆహారంలో దొండకాయను చేర్చుకోవాలి. ఎందుకంటే దొండకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్త సరఫరా బాగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దొండకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. దొండకాయ తినటం వలన కొంతమందికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఎలర్జీ వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News