Kitchenvantalu

Watermelon Dosa:ఎప్పుడు మాములు దోశ కాకుండా ఈ స్టైల్ లో దోశ ట్రై చేయండి

Watermelon Dosa:సాదారణంగా పుచ్చకాయ లో ఎరుపు బాగాన్ని తినేసి తెలుపును మాత్రం పారేస్తుంటారు. కాని తెలుపు కండ కూడ చాలా మంచిది.అందుకే తెల్లని భాగంతో దోశలు వేయండం ఎలాగో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
మెంతులు – ½ టీ స్పూన్
పుచ్చకాయ తెల్లని భాగం – తగినంత
అల్లం – 1 ఇంచ్
పచ్చిమిర్చి – 3

తయారీ విధానం
1.ముందుగా బియ్యం,శనగపప్పు,మెంతులను శుభ్రంగా కడిగి మూడు లేదా నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి.
2.ఇప్పుడు మిక్సి జార్లోకి నానిన బియ్యం, పప్పు,పుచ్చకాయ ముక్కలు,అల్లం ,పచ్చిమిర్చి వేసుకోని అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3.గ్రైండ్ చేసుకున్న పిండిని గంట పాటు నాననివ్వండి.
4.స్టవ్ పై పెనం పెట్టుకోని బాగా వేడిక్కెని పెనం పై గరిటడు పిండిని దోశలుగా వేసుకోండి.
5.అంచులకు నూనె,లేదా నెయ్యిని వేసుకోని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే పుచ్చకాయ దోశ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News