Kitchenvantalu

Kakarakaya Pulusu:చేదు లేని కాకరకాయ పులుసు ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది

Kakarakaya Pulusu:కాకరకాయ పులుసు..చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి పులుసు కూరలు చేసారంటే ముద్ద మిగల్చకుండా లాగించేస్తారు. చేదు కాకరకాయలతో పుల్ల పుల్లని,స్పైసీ కాకరకాయ పులుసు ప్రిపేర్ చేసేయండి.

కావాల్సిన పదార్ధాలు
కాకరకాయలు – ¼ kg
ఉల్లిపాయలు – 1 కప్పు
చింతపండు – 30 గ్రాములు
కరివేపాకు – ½ కప్పు
పచ్చిమిర్చి – 2
మిరియాల పొడి – 2 టీ స్పూన్స్
ఉప్పు – తగినంత
పసుపు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
నువ్వుల పొడి – 2 టీ స్పూన్స్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
చక్కెర – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా కాకరకాయలను చివరలు కట్ చేసుకోని గుండ్రని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.ముక్కల్లోకి పసుపు,ఉప్పు వేసి కలుపుకోని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
3.నానిన కాకరకాయ ముక్కలను గట్టిగా వత్తుకోని రసాన్ని తీసివేయాలి.
4.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి జీలకర్ర,ఉల్లిపాయలు పసుపు వేసి వేపుకోవాలి.

5.ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమిషం పాటు వేపుకోని కాకరకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి.
6. పచ్చిమిర్చి ,కరివేపాకు వేసి మూత పెట్టుకోని లో ఫ్లేమ్ పై ఉడికించుకోవాలి.
7.ఐదు నిమిషాలు ఉడకించాక అందులోకి కారం,ఉప్పు,ధనియాల పొడి,నువ్వుల వేసి కలుపుకోవాలి.
8.కారం ముక్కలకు పట్టుకున్నాక చింతపండు నీళ్లను వేసి కలుపుకోని టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి.
9.పులుసు చిక్కపడే వరకు మరిగించుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మని కాకరకాయ పులుసు రెడీ.