Beauty Tips

Yellow Teeth:ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి

Yellow Teeth:ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి.. పళ్ళు తెల్లగా ఉంటేనే ముఖానికి అందం. అందువల్ల మనలో చాలా మంది గార పట్టిన ,పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. వేల కొద్ది డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు.

అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఒక కప్పులో మూడు స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్, ఒక స్పూన్ బాదం నూనె వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో పళ్లను రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకొని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో ఒకసారి మూడు రోజుల పాటు చేస్తే ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన పంటి మీద గారను తొలగించటానికి సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ దంతాలను ముత్యాల్లా తెల్లగా మార్చటానికి సహాయపడుతుంది. కార్న్ ఫ్లోర్ పంటి మీద గారను తొలగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ పళ్లను తెల్లగా మార్చటానికి సహాయపడతాయి.

గార పట్టిన,పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని శ్రద్ద పెడితే సరిపోతుంది. ఇంటి చిట్కాలను పాటించి తెల్లని ముత్యాల్లాంటి పళ్లను సొంతం చేసుకొండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.