Healthhealth tips in telugu

Coconut And Tulasi: వేసవిలో కొబ్బరి నీరు+తులసి కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?

Coconut And Tulasi:కొబ్బరి నీరు+తులసి కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా.. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటానికి శ్రద్ద పెడుతున్నారు.

వేసవికాలం ఎండలు పెరిగిపోయాయి. ఈ సమయంలో కొబ్బరినీటిలో నాలుగు తులసి ఆకులు లేదా తులసి రసం కలిపి కలిపి తాగితే ఏమి అవుతుందో తెలుసు కుందాం. ఒక గ్లాస్ కొబ్బరి నీటిలో తాజా తులసి ఆకులు లేదా తులసి రసం వేసి బాగా కలిపి రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు.

ఈ విధంగా తాగటం వలన ఒత్తిడి,ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనలో చాలా మంది మారిన పరిస్థితులకు తీవ్రమైన ఒత్తిడి,డిప్రెషన్ కి గురి అవుతున్నారు. ఒత్తిడిగా ఉన్నప్పుడూ ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఎండలో బయటకు వెళ్ళి వచ్చాక ఈ నీటిని తాగితే వడదెబ్బ సమస్య లేకుండా ఉండటమే కాకుండా శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచుతుంది. అలాగే అలసట, నీరసం, నిస్సత్తువను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నీటిని తీసుకుంటే కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళు కరిగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."