Healthhealth tips in telugu

Eye itching:కళ్లల్లో మంట, దురదతో ఇబ్బంది పడుతున్నారా?

Eye itching : కళ్లల్లో మంట, దురదతో ఇబ్బంది పడినప్పుడు ఇప్పుడు చెప్పే చిట్కాలు సహాయపడతాయి. కంటి అలసట తొలగిపోవాలంటే… కీరను చక్రాల్లా కోసి కళ్లపై ఉంచుకుని పది నిమిషాల తరువాత తీసేయాలి. కళ్ల అలసట పోతుంది. కంటి మంట తగ్గిపోతుంది.

అదే పనిగా కంప్యూటరుతో పని చేసేవాళ్లు కళ్లకు సంబంధించిన వ్యాయామాల్ని కచ్చితంగా చేయాలి. ముందు కళ్లను గుండ్రంగా తిప్పాలి. తరవాత కుడి, ఎడమలవైపు తిప్పాలి. ఇలా రోజులో కుదిరినప్పుడల్లా చేస్తే అలసట దూరమవుతుంది. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.

అలాగే కీరదోస రసంలో కాస్త గులాబీనీరు కలిపి అందులో దూది ఉండల్ని ముంచి కళ్లపై పెట్టుకోవాలి. అవి ఆరిపోయాక తీసేస్తే అలసట పోవడమే కాదు.. కళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కళ్ల అలసటను దూరం చేసి, సాంత్వన అందించడంలో తేనె, పాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి.

రెండు చెంచాల తేనెలో కాసిని పాలు కలిపి కళ్ల చుట్టూ నెమ్మదిగా దూదితో రాసుకోవాలి. ఇది బాగా ఆరాక చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే ఫలితం ఉంటుంది. కళ్ల మంట కూడా తగ్గుతుంది. ఒక బంగాళాదుంపను తురిమి దాన్ని కళ్లపై పెట్టుకోవాలి. బాగా ఆరాక కడిగేస్తే చాలు. అలసట పోవడమే కాదు, నల్లనివలయాలూ తొలగిపోతాయని బ్యూటీషియన్లు అంటున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.