Karnataka Style Vegetable Rice :కర్ణాటక స్టైల్ వెజిటబుల్ పులావ్.. లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ..
Karnataka Style Vegetable Rice :కర్ణాటక స్టైల్ వెజిటబుల్ పులావ్.. లంచ్ బాక్స్‌కి పర్ఫెక్ట్ రెసిపీ..ఆరోగ్యకరమైన ఆహారం కోసం చూస్తుంటే, కర్ణాటక శైలిలో వెజిటబుల్ పులావ్ రైస్ ఒక మంచి ఎంపిక. ఇది తయారు చేయడం చాలా సులభం మరియు దీనిలో వాడే కూరగాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
బ్యాచిలర్స్ సైతం సులభంగా దీన్ని తయారు చేయవచ్చు. ఇది కేవలం ఆరోగ్యకరమైనదే కాకుండా రుచికరమైన వంటకం కూడా. మరి, ఈ రుచికరమైన వంటకం ఎలా తయారు చేయాలో మరియు దీనికి అవసరమైన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం – రెండు కప్పులు
నీరు – 3 కప్పులు
ఉప్పు – రుచికి తగినంత
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
క్యారెట్ – 1 పెద్దది
బీన్స్ – 10
బంగాళదుంప – 1 పెద్దది
స్టార్ పువ్వు – 1
లవంగాలు – 4
యాలకులు – 2
జాపత్రి – కొంచెం
బిర్యానీ ఆకు – 1
పచ్చిమిర్చి – 5
తాజా కొబ్బరి – అరకప్పు
పుదీనా ఆకులు – గుప్పెడు
కొత్తిమీర – గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు – 8
అల్లం – రెండు అంగుళాలు
జీలకర్ర – అర టీస్పూన్
తయారీ విధానం
మొదట, బాస్మతి అన్నాన్ని కడిగి, సుమారు అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత, ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని పొడవుగా కోసుకోవాలి. క్యారెట్‌ను, బంగాళదుంపను పైన తొక్క తీసి, క్యూబ్‌ల మాదిరిగా కోసుకోవాలి. ఆ తర్వాత, మిక్సీ జార్‌ను తీసుకుని, అందులో పచ్చిమిర్చి, కొబ్బరి, పుదీనా ఆకులు, కొత్తిమీర, పొట్టు తీసిన వెల్లుల్లి, అల్లం, జీలకర్ర వేసి పేస్ట్ చేయాలి. పచ్చి కొబ్బరి దొరకకపోతే, ఎండు కొబ్బరి తీసుకుని, దానిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ముందుగా స్టౌవ్ వెలిగించి, కుక్కర్‌ను పెట్టండి. అందులో నెయ్యి వేసి, కరిగాక వేడిగా ఉంచండి. తరువాత లవంగాలు, జాపత్రి, యాలకులు, బిర్యానీ ఆకు, స్టార్ అనీస్ వేసి, వేగించండి. వీటిని కొంచెం వేగించాక, ఉల్లిపాయలు వేసి, గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేయండి. తరువాత క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసి, ఫ్రై చేయండి. బీన్స్ వేసి, కొంచెం ఉడికించండి.
మగ్గిన తరువాత, ముందుగా తయారు చేసిన పేస్ట్ వేసి, బాగా కలిపి, రెండు నిమిషాలు ఉండికించండి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి, బాగా కలిపి, సరిపడా నీళ్లు జోడించి, మళ్లీ కలిపి, తగినంత ఉప్పు వేసి, కుక్కర్ మూత మూసి, రెండు విజిల్స్ వచ్చే వరకు మీడియం మంట మీద ఉడికించండి. అలా మీకు రుచికరమైన, ఆరోగ్యకరమైన వెజిటేబుల్ రైస్ సిద్ధం అవుతుంది.
లంచ్ బాక్స్ కోసం ఈ వంటకాన్ని నిత్యం తయారు చేయవచ్చు. ఇది ఆరోగ్యకరమైనది మరియు పిల్లలకు ఇష్టమైనది. పెద్దలు కూడా దీన్ని ఇష్టపడతారు, మరియు బ్యాచిలర్స్ సులభంగా తయారు చేయగలరు. దీన్ని రైతా లేదా ఏదైనా కూరతో కలిపి తినవచ్చు, కొందరు ఆవకాయతో కూడా తినడాన్ని ఇష్టపడతారు. ఇక ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఈ రుచికరమైన వంటకాన్ని తయారు చేసి ఆనందించండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ