Joint Pains Remedies:కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా… ఈ చిట్కాలు ఫాలో అయిపోండి
Joint Pains Home Remedies : మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ చలి కాలంలో మరింత తీవ్రంగా ఉంటుంది ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. ఇవన్నీ మనకు ఇంటిలో అందుబాటులో ఉండేవే.
అలోవెరా జెల్
దీనిని కలబంద అని కూడా అంటారు. కలబంద అనేది దాదాపు గా ఈ మధ్య కాలంలో అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఆలోవెరా జెల్ మార్కెట్లో దొరుకుతుంది. ఏదైనా ఉపయోగించవచ్చు. అలోవెరాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన కీళ్లనొప్పులను తగ్గిస్తుంది
నొప్పి ఉన్న ప్రదేశంలో కొంచెం కలబంద తీసుకొని రాస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.కలబందలో కనిపించే జెల్ ఆంత్రాక్వినోన్స్‌తో నిండి ఉంటుంది. ఇది నొప్పుల నుండి ఉపశమనం కొరకు సహాయపడుతుంది.
కలబందలో ఉండే సహజమైన నిర్విషీకరణ గుణాలు విషపూరిత వ్యర్థాల ప్రసరణ వ్యవస్థ మరియు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి. ఆయుర్వేదం ప్రకారం కీళ్ల నొప్పులు రావడానికి కారణమైన వాత దోషాన్ని తగ్గించటానికి సహాయపడి నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అలోవెరాలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి, ఇది ఇన్ఫెక్షన్లు మరియు ఇతర వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు తద్వారా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
అల్లం
అల్లం రసంలో కూడా యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి అందువల్ల మోకాళ్ళ నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అల్లం కషాయం తయారుచేసుకొని తాగాలి. ల్యూకోట్రీన్ అనే ఇన్ఫ్లమేటరీ లక్షణం నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. అల్లంలో ఉండే జింజెరోల్ ఆర్థరైటిస్‌లో మంట మరియు నొప్పిని తగ్గిస్తాయి.
ప్రతి రోజు అల్లం టీని తాగాలి.. లేదంటే ప్రతి రోజు చిన్న అల్లం ముక్కను నమిలి తినవచ్చు. అయితే అల్లం ఘాటుగా ఉంటుంది. కాబట్టి అల్లం టీ తాగటమే బెటర్. అల్లం రసంలో తేనే కలిపి కూడా తీసుకోవచ్చు.
పసుపు
పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంది. ఇది నొప్పులను మరియు వాపును తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఇటివల జరిగిన పరిశోదనలలో తేలింది. మీ ఆహారంలో పసుపును చేర్చడం లేదా కర్కుమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు మరియు మోకాలి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపును గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగవచ్చు.
గ్రీన్ టీ
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల వాపులను తగ్గిస్తుంది. రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే చాలా మంచిది. గ్రీన్ టీ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన పాలీఫెనాల్స్ సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్‌తో పోరాటం చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u