Masala majjiga:చల్ల చల్లని మసాలా మజ్జిగ.. ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోతుంది..
Masala Majjiga:ఈ వేసవికాలంలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండలో బయటకి వెళ్లి వచ్చాక విపరీతమైన దాహం వేస్తుంది. దాంతో మనలో చాలామంది ఏదో ఒక Cool Drink తాగేస్తూ ఉంటారు. అలా కాకుండా చల్లని మజ్జిగ తాగితే వేసవి తాపం తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఈ మజ్జిగకు కాస్త మసాలా యాడ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు శరీరానికి చలువ చేసే మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
పుల్లటి పెరుగు ఒక కప్పు
చల్లటి నీళ్లు ఒకటి నుంచి రెండు కప్పులు
అల్లం చిన్న ముక్క
పచ్చిమిర్చి ఒకటి
కొత్తిమీర కొద్దిగా
పుదీనా కొద్దిగా
జీలకర్ర పొడి అర స్పూను
చాట్ మసాలా
నల్ల ఉప్పు పావు స్పూను
ఉప్పు తగినంత
ముందుగా పెరుగును ఒక గిన్నెలో వేసి గిల కొట్టాలి. దానిలో సరిపడా నీటిని వేసి బాగా కలపాలి. మజ్జిగ పల్చగా కావాలి అనుకుంటే మరికొన్ని నీటిని కలపవచ్చు. దీనిలో తురిమిన అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా ఆకులను క్రష్ చేసి కలపాలి.
ఆ తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా, నల్ల ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా అవసరమైనంతవరకు ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మజ్జిగను ఫ్రిజ్లో పెట్టి ఒక అరగంట అయ్యాక తాగితే చాలా బాగుంటుంది.
ఎండాకాలంలో వచ్చే వడదెబ్బ నుండి రక్షణ కలగాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ మసాలా మజ్జిగ చాలా బాగా సహాయపడుతుంది. మజ్జిగలో ఉండే ఎలక్ట్రోలైట్స్,ఖనిజాలు శరీరాన్ని చల్లగా ఉంచి వడదెబ్బ బారిన పడకుండా కాపాడుతుంది అలాగే మజ్జిగలో ఉండే మంచి బ్యాక్టీరియా వేసవికాలంలో వచ్చే జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. కాబట్టి ఈ మజ్జిగను తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

