Bitter gourd:కాకరకాయ చేదుని తగ్గించే టిప్స్..
Bitter gourd:మనలో చాలామంది కాకరకాయ చేదుగా ఉందని తినటానికి ఇష్టపడరు. అయితే కాకరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రోజు కాకరకాయ చేదును తగ్గించి రుచిని పెంచటానికి చిట్కాలను తెలుసుకుందాం.
కాకరకాయను కోసినప్పుడు గింజలు తీసేసి కూర వండుకోవాలి. గింజలతో వండుకుంటే కాస్త చేదు ఎక్కువగా ఉంటుంది.
కాకరకాయ ముక్కలకు ఉప్పు రాసి 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత ఆ ముక్కలను చేతితో పిండి నీళ్ళను తీసేయాలి. అప్పుడు కాకరకాయ చేదు తగ్గుతుంది.
కాకరకాయతో మసాలా కూర చేసుకోవాలని అనుకున్నప్పుడు కాకరకాయ ముక్కలను నిమ్మరసం లేదా పెరుగులో అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత కూర వండుకుంటే చేదు తగ్గుతుంది.
కాకరకాయను వండటానికి ముందు వేడి నీటిలో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఇలా చేయడం వలన చేదు తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

