Hair Growth Tips:జుట్టు పొడవుగా పెరగాలంటే ఇలా చేస్తే సరి
Hair Growth Tips:జుట్టు పొడవుగా పెరగడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకునే ఆహారం విషయంలో, అలాగే జుట్టుకు పోషణ ఇచ్చే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, బయోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది.
వారంలో రెండు సార్లు నూనెను కాస్త గోరువెచ్చగా చేసి తలకు రాసి సున్నితంగా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయడం వలన తల మీద చర్మం లో రక్త ప్రసరణ బాగా సాగి జుట్టు రాలకుండా ఉంటుంది.
క్రమం తప్పకుండా జుట్టును కత్తిరించడం వల్ల జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.
పెరుగులో విటమిన్ ఈ క్యాప్సిల్ లో నూనెను కలిపి జుట్టుకు రాస్తే జుట్టుకు అవసరమైన పోషణ అంది జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
అలాగే లావెండర్ ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ నూనెను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడమే కాకుండా జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ కూడా అందుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ