Healthhealth tips in telugu

Weight Loss Seeds:బరువును తగ్గించే అద్భుతమైన గింజలు

Weight Loss Seeds;ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్య అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గటానికి మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులను చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు. ఇప్పుడు చెప్పే కొన్ని విత్తనాలను తీసుకుంటే బరువు తగ్గటానికి చాలా బాగా సహాయపడటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి

చియా సీడ్స్
ప్రతిరోజు అర స్పూను చియా సీడ్స్ నీటిలో వేసి నానబెట్టి తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న పేరుకుపోయిన కొవ్వును కరిగించడమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.

అవిసె గింజలు
అవిసె గింజలను కాస్త వేగించి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని మనం తీసుకునే ఆహారంలో కలుపుకొని తీసుకోవచ్చు. అవిస గింజలలో ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

నువ్వులు
నువ్వులలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గించడానికి సహాయపడటమే కాకుండా ఐరన్ లోపం లేకుండా చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య వస్తుంది.

గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలలో ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడుతుంది.

జనపనార విత్తనాలు
జనపనార విత్తనాలలో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్
ఈ గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ K సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ గింజలను సలాడ్స్, పెరుగు, స్మూతీ.. అలాగే చపాతి పిండిలలో కలుపుకుని తీసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ