Kitchenvantalu

Mosquito:దీన్ని నిమ్మకాయలో గుచ్చి మీ ఇంటి తలుపు దగ్గర పెట్టండి… ఒక్క దోమ కూడా లోపలికి రాదు!

Mosquito:దీన్ని నిమ్మకాయలో గుచ్చి మీ ఇంటి తలుపు దగ్గర పెట్టండి… ఒక్క దోమ కూడా లోపలికి రాదు..దోమలను తరిమికొట్టడానికి చాలా మంది రసాయన ద్రవాలు, కాయిల్స్ వంటి ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి హానికరం. అయితే వంటగదిలోని సాధారణ వస్తువులే దోమలను దూరంగా ఉంచే రామబాణం. అందులో నిమ్మకాయ ఒకటి. దాన్ని ఎలా వాడాలో ఇక్కడ చూడండి…

ఒక చిన్న దోమ కాటు మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, టైఫాయిడ్, ఫైలేరియా వంటి ప్రమాదకర వ్యాధులకు దారి తీస్తుంది. ఇలాంటి బెడద నుంచి బయటపడటానికి రసాయనాలు వాడకుండా, ఇంటి చిట్కాలతోనే సాధ్యం. సాయంత్రం తలుపులు, కిటికీలు తెరిచి ఉంచినా దోమలు రాకుండా చేయవచ్చు. ఆ చిట్కా ఏమిటంటే – నిమ్మకాయ + లవంగం!

ఎలా చేయాలి?
ఒక నిమ్మకాయను సగం కోసి, అందులో 5-6 లవంగాలు (cloves) గుచ్చండి. ఈ నిమ్మకాయ ముక్కను ఇంటి తలుపు దగ్గర, కిటికీల పక్కన, మూలల్లో పెట్టండి. నిమ్మకాయ, లవంగం కలిసిన వాసన దోమలను దూరంగా పరుగెత్తిస్తుంది.

అదనపు చిట్కా: లవంగం నూనెను చర్మానికి రాసుకుంటే దోమ కాటు నుంచి మరింత రక్షణ లభిస్తుంది.ఇకపై రసాయనాలు వద్దు… నిమ్మకాయతోనే దోమలను గడ్డిపెట్టండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."