Hyderabad to Ooty IRCTC Package:హైదరాబాద్ టు ఊటీ: సమ్మర్ హాలిడేస్‌కి IRCTC అదిరిపోయే ప్యాకేజీ.. రూ. 16,360 కే కూల్ ట్రిప్!
Hyderabad to Ooty IRCTC Package:హైదరాబాద్ టు ఊటీ: సమ్మర్ హాలిడేస్‌కి IRCTC అదిరిపోయే ప్యాకేజీ.. రూ. 16,360 కే కూల్ ట్రిప్.. మండుతున్న ఎండల నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారా? ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా కూల్ ప్లేస్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా?
అయితే ప్రకృతి రమణీయతకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘ఊటీ’ మీకు బెస్ట్ ఆప్షన్. పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వేస్ (IRCTC) తక్కువ ధరలో ఒక సూపర్ సమ్మర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.’అల్టిమేట్ ఊటీ ఎక్స్-హైదరాబాద్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు, ధరల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ప్యాకేజీ హైలైట్స్ ఇవే:
ట్రిప్ వ్యవధి: 5 రాత్రులు, 6 రోజులు
ప్రయాణం ప్రారంభం: ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2:25 గంటలకు (శబరి ఎక్స్‌ప్రెస్).
బోర్డింగ్ పాయింట్లు: సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, తెనాలి. (ఈ స్టేషన్లలో మీరు రైలు ఎక్కవచ్చు, మళ్లీ తిరుగు ప్రయాణంలో ఇక్కడే దిగవచ్చు).
ప్యాకేజీ ధరలు (సమ్మర్ స్పెషల్):
వేసవి రద్దీ దృష్ట్యా మార్చి 31 నుంచి జూన్ 23 వరకు ప్రత్యేక ధరలు వర్తిస్తాయి. మీ బడ్జెట్‌ను బట్టి రెండు క్లాసుల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు:
స్టాండర్డ్ క్లాస్: ఇద్దరు షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ. 16,360
కంఫర్ట్ క్లాస్ (3-టైర్ ఏసీ): ఇద్దరు షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ. 18,890 (ఐదేళ్ల పైబడిన పిల్లలకు ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి).
టూర్ సాగుతుందిలా..
డే 1 & 2: సికింద్రాబాద్‌లో ప్రయాణం మొదలై మరుసటి రోజు కోయంబత్తూరు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఊటీ వెళ్లి, హోటల్‌లో ఫ్రెషప్ అయ్యాక బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ సందర్శిస్తారు.
డే 3: దొడబెట్టా పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ లాంటి అద్భుతమైన ప్రదేశాల వీక్షణ.
డే 4 & 5: కూనూర్ అందాలను ఆస్వాదించి తిరిగి ఊటీ వస్తారు. ఐదో రోజు హోటల్ చెక్-అవుట్ చేసి కోయంబత్తూరు నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
డే 6: ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో మీ అందమైన ట్రిప్ ముగుస్తుంది.
ప్యాకేజీలో కవర్ అయ్యేవి.. కవర్ కానివి!
ఇవి ఉచితం: రైలు టికెట్లు, 3 రోజుల హోటల్ వసతి (ఊటీలో), సైట్ సీయింగ్ కోసం ఏసీ వెహికల్.
మీరే పెట్టుకోవాల్సినవి: మధ్యాహ్నం/రాత్రి భోజనం, టూరిస్ట్ ప్లేసుల దగ్గర ఎంట్రీ టికెట్లు, బోటింగ్ ఖర్చులు.
ముఖ్య గమనిక: ప్రయాణానికి నాలుగు రోజుల ముందు మాత్రమే ఫైనల్ టికెట్లను IRCTC జారీ చేస్తుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

