కేవలం 5 నిమిషాల మసాజ్‌తో మోచేతుల నలుపు దూరం: అద్భుతమైన ఆకు చిట్కా!
Elbow darkness removal: హాఫ్ హ్యాండ్స్ డ్రెస్సులు వేసుకోవాలంటే నల్లటి మోచేతుల వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? అయితే ఇకపై ఖరీదైన క్రీమ్స్, లోషన్లు వాడాల్సిన అవసరం లేదు!
మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే ఒక ఆకుతో మసాజ్ చేస్తే మోచేతుల నలుపు ఇట్టే మాయం అవుతుంది. ఆ ఆకు ఏమిటి? మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మార్చడానికి దాంతో ఎలా మసాజ్ చేయాలో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి.
సాధారణంగా కొంతమంది మోచేతులు నల్లగా అందవిహీనంగా కనబడుతూ ఉంటాయి ఈ సమస్య ఆడవారిలోనూ మగవారిలోనూ ఇద్దరిలోనూ కనబడుతుంది కాకపోతే మగవారు పెద్దగా పట్టించుకోరు.

ఆడవారు మాత్రం ఈ సమస్య గురించి తీవ్రంగా ఆలోచించి ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టకుండా మన ఇంటిలో ఉండే తులసి ఆకులతో తగ్గించుకోవచ్చు.
తులసి ఆకు ను ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు దీనికోసం 10 నుంచి 12 తులసి ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని మోచేతుల పై రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే మరో చిట్కా తెలుసుకుందాం తులసి ఆకుల రసంలో కొంచెం బియ్యపిండి, కొంచెం తేనె వేసి బాగా కలిపి మోచేతులకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. అరగంటయ్యాక నీటిని జల్లుతూ రబ్ చేస్తూ కడగాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే నలుపు క్రమంగా తగ్గిపోతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

