ప్రతి ఇల్లాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అద్భుతమైన కిచెన్ టిప్స్.. అస్సలు మిస్ అవ్వకండి!
Kitchen And Cooking Tips in telugu:వంటగదిలో గంటల తరబడి కష్టపడుతున్నారా? అయితే మీ పనిని సులభం చేసి, సమయాన్ని ఆదా చేసే ఈ అద్భుతమైన వంటింటి చిట్కాలు (Kitchen Tips) మీకోసమే. అస్సలు మిస్ అవ్వకండి!
1. వామును నిప్పులపై వేసి పొగ పీలుస్తూ ఉంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది.
2. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో కొలస్ట్రాల్ తగ్గిపోతుంది.
3. ఆహారం తీసుకోవటానికి గంట ముందు కప్పు వేడి నీళ్ళు త్రాగితే రక్త శుద్ది జరుగుతుంది.
4. వంటగదిలో బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు బిర్యానీ ఆకును పొడిగా చేసి బొద్దింకలు ఉండే ప్రదేశంలో చల్లితే, ఆ వాసనకు బొద్దింకలు చనిపోతాయి.
5. ఎండుకొబ్బరిపై కొద్దిగా నీళ్లు చల్లి కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తురిమితే కొబ్బరి తురుము సులువుగా వస్తుంది.
6. ద్రాక్షలో ఉండే ఫైటో కెమికల్స్ కొలస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
7. జ్వరం వచ్చిన వారికి ఫైనాపిల్ రసంలో కొంచెం తేనే కలిపి ఇస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
8. కూరల్లో మసాలా ఎక్కువైతే టమోటా గుజ్జు కలిపితే మసాలా తగ్గటమే కాకుండా కూర రుచి కూడా పెరుగుతుంది.
9. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి మొక్కజొన్న మంచి ఔషధం.
10. యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుంది.

