పార్లర్ కి వెళ్లే పనిలేదు.. తేనెతో ఇలా చేస్తే మీ ముఖం తెల్లగా మెరిసిపోతుంది!
Honey and turmeric Face Glow Tips In Telugu : నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చర్మ సౌందర్యంపై శ్రద్ధ పెట్టడానికి, గంటల తరబడి బ్యూటీ పార్లర్‌లో కూర్చోవడానికి చాలామందికి సమయం దొరకడం లేదు. రోజూ ఎండ, కాలుష్యం వల్ల ముఖం నల్లగా, కాంతివిహీనంగా మారుతుంటుంది. దీనికోసం ఖరీదైన క్రీమ్స్, ఫేషియల్స్ అవసరం లేకుండా, మన ఇంట్లో ఉండే ‘తేనె’తో అద్భుతమైన గ్లో సొంతం చేసుకోవచ్చు.
తేనె చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసి, మచ్చలను తగ్గించి ముఖాన్ని తెల్లగా, మృదువుగా మారుస్తుంది. కేవలం పది నిమిషాల్లో పార్లర్ ఫేషియల్ లాంటి గ్లో తెచ్చే ఆ అద్భుతమైన చిట్కా ఏంటో, తేనెను ముఖానికి ఎలా వాడాలో ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం.

ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి అందం మీద శ్రద్ద పెరిగి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతున్నారు. అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా నల్లని మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
మనలో చాలా మంది ముఖం మీద నల్లని మచ్చలు, ముడతలు లేకుండా అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మార్చుకోవచ్చు.
దీని కోసం ముందుగా ఒక పొడిని తయారుచేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి పసుపు వేసి సిమ్ లో వెగించాలి. పసుపు బాగా వేగి రంగు మారాలి. ఈ పసుపును ఒక డబ్బాలో పోసి నిల్వ చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. మార్కెట్ లో దొరికే పసుపు కాకుండా ఇంటిలో పసుపు కొమ్ములతో తయారుచేసుకున్న పసుపు అయితే మంచిది.
ఒక బౌల్ లో ముఖానికి అవసరమైన వేగించిన పసుపును తీసుకొని దానిలో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది. పసుపు, తేనే రెండు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.
పసుపు,తేనె రెండింటిలో ఉన్న లక్షణాలు ముఖం మీద నల్లని మచ్చలు, ముడతలు లేకుండా తెల్లగా, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ట్రై చేసి మంచి ఫలితాన్ని పొందండి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చులో మంచి పలితాన్ని పొందవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

