కళ్ళకు కాటుక పెట్టుకునే అలవాటు ఉందా? అయితే ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే!
Kallaku Katuka : అందమైన కళ్ళు అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది కాటుక. అమ్మాయిల రోజువారీ అలంకరణలో కాటుకకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. కళ్ళను ఆకర్షణీయంగా, పెద్దవిగా కనిపించేలా చేసే ఈ కాటుకను రోజూ పెట్టుకోవడం వల్ల మన కళ్ళకు నిజంగానే మేలు జరుగుతుందా?
మార్కెట్లో దొరికే కెమికల్స్ నిండిన కాటుకల వల్ల తెలియకుండానే కంటి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చుకుంటున్నామా? కాటుక వాడేటప్పుడు మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి? కళ్ళను సురక్షితంగా కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పోస్ట్‌లో పూర్తిగా తెలుసుకుందాం.
కళ్ళకు కాటుక పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేము. కళ్ళు ఎంత చిన్నగా ఉన్నా కాటుక పెడితే కళ్ళ అందం రెట్టింపు అవుతుంది. కళ్ళకు కాటుక పెట్టుకోవడం వలన అందం ఒక్కటే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కళ్ళకు కాటుక పెట్టుకుంటే దుమ్ము ధూళి కంటిలోకి వెళ్లదు. సూర్య కిరణాలు కంటి మీద పడితే ఎంత ప్రమాదమో మనకు తెలిసిన విషయమే. అలాంటి సూర్య కిరణాలు కంటి మీద పడకుండా కాటుక కాపాడుతుంది. కాటుక కళ్ళకు చల్లదనాన్ని ఇవ్వటమే కాకుండా మెరిసేలా చేస్తుంది. కళ్ళు ఏ ఆకారంలో ఉన్నా కాటుక పెట్టగానే మంచి ఆకర్షణీయంగా కనబడతాయి.
కాటుక నిద్ర పట్టటానికి కూడా సహాయపడుతుంది. అందుకే ప్రతి అమ్మాయి కాటుక పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతుంది. అయితే కాటుక పెట్టుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. మార్కెట్లో దొరికే కాటుకలో కొన్ని కెమికల్స్ ఉండే అవకాశం ఉంది.
కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్న కాటుకను పెట్టుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. మార్కెట్లో దొరికే కాటుకలో ఉండే కెమికల్ కారణంగా దురద మంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. దురద మంట వస్తే కాటుక పెట్టుకోవడం మానేయాలి. కాటుక పెట్టుకునే ముందుకు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
ముఖంపై, కళ్లపై ఏమాత్రం తడిలేకుండా తుడుచుకోవాలి.తరువాతే కాటుక పెట్టుకోవాలి. కళ్లకు కాటుక పెట్టుకుంటే శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుందని ఆయుర్వేదంలో చెప్పుతారు. చూశారుగా కళ్ళకు కాటుక పెట్టుకోవటం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో…కాటుక పెట్టుకొని ఈ ప్రయోజనాలను పొందండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

