Healthhealth tips in telugu

కరివేపాకు Vs బిర్యానీ ఆకు: ఆరోగ్యానికి ఏది మంచిది? మీకు తెలియని ఆసక్తికర నిజాలు!

Curry leaves And bay leaves Benefits : భారతీయ వంటకాల్లో ‘కరివేపాకు’, ‘బిర్యానీ ఆకు’లకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. తాలింపులో కరివేపాకు వేస్తే వచ్చే రుచి, బిర్యానీలో ఆకు వేస్తే వచ్చే సువాసన అద్భుతంగా ఉంటాయి. అయితే మనలో చాలామంది వంటలో వేసిన ఈ ఆకులను తినేటప్పుడు పక్కకు తీసి పారేస్తుంటారు.

అసలు కరివేపాకు, బిర్యానీ ఆకు.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? ఏది తింటే మనకు పోషకాలు పూర్తిగా అందుతాయి? షుగర్ కంట్రోల్ చేయడం దగ్గరి నుంచి, బరువు తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు ఈ రెండు ఆకుల్లో దాగి ఉన్న నమ్మలేని నిజాలు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం. ఇకపై ఈ ఆకులను పారేసే ముందు ఈ నిజాలు తప్పక తెలుసుకోండి!

కరివేపాకు,బిర్యానీ ఆకులలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది తింటే మంచిదో తెలుసుకుందాం. బిర్యానీ ఆకును ఎక్కువగా మసాలా వంటలలో ఉపయోగిస్తారు. అలాగే కరివేపాకుకు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

కరివేపాకు బిర్యానీ ఆకుతో పోలిస్తే చిన్నగా ఉంటుంది. కరివేపాకును తాజాగా ఉపయోగిస్తారు. బిర్యానీ ఆకును ఎండిన ఆకును ఉపయోగిస్తారు. కరివేపాకు,బిర్యానీ ఆకు రుచిలో విబిన్నంగా ఉంటాయి. వంటలలో బిర్యానీ ఆకులను వేసినప్పుడు తినేటప్పుడు తీసివేస్తాం. అదే కరివేపాకు అయితే పాడేయకుండా తింటాము.

కరివేపాకు కొద్దిగా సిట్రస్ సువాసన మరియు ప్రత్యేకమైన ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. వాటిని తరచుగా లెమన్‌గ్రాస్‌తో పోల్చుతారు. బిర్యానీ ఆకులు థైమ్ మరియు ఒరేగానో వంటి మూలికా మరియు పూల సువాసనను కలిగి ఉంటాయి. కరివేపాకు,బిర్యానీ ఆకు రెండూ కూడా వంటలకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి.

కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి మరియు బి2,ఐరన్,కాల్షియం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బిర్యానీ ఆకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండూ కూడా .ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. బిర్యానీ ఆకుతో పోలిస్తే కరివేపాకును ప్రతి రోజు తీసుకోవచ్చు. బిర్యానీ ఆకు తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."