కెమికల్ డైలకు గుడ్ బై చెప్పండి.. ఇంట్లో ఉండే వీటితో తెల్ల జుట్టు కుదుళ్ల నుండే నల్లగా మారుతుంది!
White Hair Turn black:ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘తెల్ల జుట్టు’ (White Hair). కాలుష్యం, పోషకాహార లోపం, మరియు విపరీతమైన ఒత్తిడి వల్ల పాతికేళ్లు నిండకముందే జుట్టు తెల్లబడిపోతోంది. దీన్ని కవర్ చేసుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైలు, కలర్స్ వాడుతుంటారు.
కానీ వాటివల్ల జుట్టు తాత్కాలికంగా నల్లబడినా, అందులోని రసాయనాల వల్ల ఉన్న జుట్టు ఊడిపోవడం, మిగిలిన జుట్టు కూడా త్వరగా తెల్లబడటం జరుగుతుంది. అయితే ఎలాంటి హెయిర్ డై అవసరం లేకుండా, మన ఇంట్లో ఉండే సహజమైన ఆయుర్వేద పదార్థాలతోనే తెల్ల జుట్టును కుదుళ్ల నుండి శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చు. జుట్టుకు మంచి పోషణను అందిస్తూ, సహజమైన నలుపు రంగును ఇచ్చే ఆ అద్భుతమైన నేచురల్ చిట్కా ఏంటో, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
హెయిర్ డై అవసరం లేదు.. తెల్లజుట్టు ఎప్పటికి నల్లగా మారాలంటే …జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటారు. దాంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి.

అలా కాకుండా మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక 2 స్పూన్ల ఉసిరి ముక్కలను, 3 రెబ్బల కరివేపాకు ఆకులను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.
ఈ విధంగా మరగటం వలన ఉసిరి, కరివేపాకులో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని ఒక బౌల్ లోకి వడకట్టాలి. ఈ నీటిలో అరచెక్క నిమ్మరసం కలపాలి. ఈ నీటిని జుట్టుకి బాగా పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాలు, తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది.
ఉసిరి ముక్కలు, కరివేపాకు, నిమ్మరసం ఈ మూడు తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు రాలే సమస్యకు కారణం అయినా చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

