నల్లగా ఉందని పారేస్తున్నారా? బొగ్గుతో కలిగే ఈ అద్భుత లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Charcoal Benefits :సాధారణంగా మనలో చాలామంది బొగ్గును చూడగానే అదేదో పనికిరాని వస్తువులా, కేవలం వంట చేయడానికి లేదా ఇస్త్రీ పెట్టెలలో వేయడానికి మాత్రమే పనికొస్తుందని అనుకుంటారు. ఇంట్లో కట్టెలు కాలిన తర్వాత మిగిలిన బొగ్గును నల్లగా ఉందని బయట పారేస్తుంటారు. కానీ, ఆ నల్లని బొగ్గు వెనుక మన ఆరోగ్యానికి, అందానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా?
ముఖ్యంగా ‘యాక్టివేటెడ్ చార్కోల్’ (Activated Charcoal) ఇప్పుడు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్, టూత్పేస్ట్లు మరియు ఫేస్ వాష్లలో ప్రధానంగా వాడుతున్నారు. పచ్చని పళ్లను ముత్యాల్లా మెరిపించడం దగ్గర నుంచి.. ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించడం, ఇంట్లోని దుర్వాసనను పోగొట్టడం వరకు బొగ్గు చేసే మేలు అంతా ఇంతా కాదు. మరి పనికిరాదని పారేసే బొగ్గుతో కలిగే ఆ అద్భుతమైన ప్రయోజనాలేంటో, దాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
బొగ్గే కదా అని పారేయకండి… దీని గురించి తెలిస్తే మీరు అసలు వదిలిపెట్టరు.. నల్లగా ఉండే బొగ్గుని చూస్తే చాలా మందికి చాలా చిరాకుగా ఉంటుంది. కానీ బొగ్గులో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
వాటి గురించి తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అంతేకాక బొగ్గుని ఉపయోగిస్తారు. బొగ్గుతో పేస్ ప్యాక్ వేసుకోవచ్చు. బొగ్గును మెత్తని పొడిగా చేసి నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి రాసి ఆరాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖ కాంతి పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.
ఈ కాలుష్యం కారణంగా ముఖం మీద రంద్రాలు పెద్దవిగా కనిపించి ముఖం కాస్త అసహ్యంగా కన్పిస్తుంది. దాంతో చాలా మంది ఆందోళనకు గురి అయ్యి వేలు ఖర్చు పెట్టి బ్యూటీపార్లర్ చుట్టూ తిరుగుతారు.
ఆలా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా మనం వాడే ఫేక్ ప్యాక్ లో కొంచెం బొగ్గు పొడి కలిపి ప్యాక్ ముఖానికి వేసుకుంటే ముఖ చర్మంలో మృతకణాలు మరియు మురికి తొలగిపోతుంది. ముఖం మీద చెమట,జిడ్డు అనేవి ఒక పట్టాన వదలవు. దీని కోసం ఎన్నో క్రీములు వాడుతూ, వైద్యులు చుట్టూ, పార్లర్ల చుట్టూ తిరుగుతారు.
కాని ఇలాంటివారు బొగ్గు మాస్క్ను ఉపయోగిస్తే అతిగా చర్మం నుంచి విడుదలవుతున్న నూనెలు తొలగిపోతాయట. ఇలా చేస్తే కచ్చితంగా చర్మం మృదువుగా కనిపిస్తుందని అంటున్నారు. ఇలా చేస్తే సహజనూనెలు కోల్పోకుండా ఉంటాయని చెప్తున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

