ఎప్పుడూ చేసేలా కాకుండా ఈ సీక్రెట్ పొడితో గుత్తి బీరకాయ వేపుడు చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది!
Gutti Beerakaya Podi Fry: మన ఇళ్లలో తరచూ వండుకునే కూరగాయల్లో బీరకాయ ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది, తేలికగా జీర్ణమవుతుంది కూడా. అయితే బీరకాయ అనగానే ఎప్పుడూ చేసేలా పాలు పోసి ఇగురు కూర, పప్పు లేదా పచ్చడి చేస్తుంటారు. దీనివల్ల ఇంట్లో వాళ్లకు, ముఖ్యంగా పిల్లలకు బీరకాయ కూర అంటేనే మొహం మొత్తేస్తుంది.
అలా కాకుండా ఎప్పుడూ చేసే రొటీన్ పద్ధతికి భిన్నంగా ఒక్కసారి ‘గుత్తి బీరకాయ పొడి ఫ్రై’ (Gutti Beerakaya Podi Fry) చేసి చూడండి. గుత్తి వంకాయ కూరకు ఏమాత్రం తీసిపోని రుచితో, కమ్మని మసాలా పొడి స్టఫింగ్తో చేసే ఈ వేపుడు ఇంటిల్లిపాదికీ తెగ నచ్చేస్తుంది.
వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ గుత్తి బీరకాయ ఫ్రై కలుపుకుని తింటుంటే ఆ రుచే వేరు! పప్పుచారు, సాంబార్లోకి కూడా ఇది సైడ్ డిష్గా అదిరిపోతుంది. మరి నోరూరించే ఈ గుత్తి బీరకాయ పొడి వేపుడును ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
ఎంతో శ్రేష్టమైనా బీరకాయ తో ఫ్రై కర్రీస్ బోర్ అనిపిస్తే ,లేత బీరకాయలకు మసాల దట్టిచ్చి గుత్తిబీర కాయ స్పెషల్ చేయండి. రుచి అదిరిపోతుంది.
కావాల్సిన పదార్ధాలు
బీరకాయ – ¼ kg
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
నువ్వలు – 2 టేబుల్ స్పూన్స్
కొబ్బరి – 2 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు – 3-4
జీలకర్ర – 1 ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 5-6
పెసలు – 1 టీ స్పూన్
లవంగాలు – 3
దాల్చిన చెక్క – 1 ఇంచ్
పసుపు – ½ టీ స్పూన్
కరివేపాకు – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
తయారీ విధానం
1.ముందుగా బీరకాయలను శుభ్రంచేసుకోని తొక్కతీసుకోవాలి.
2.గుత్తివంకాయ మాదిరిగా బీరకాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోని మద్యలో చీలికలు పెట్టుకోవాలి.
3.ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ధనియాలు,జీలకర్ర,లవంగాలు ,దాల్చిన చెక్క,నువ్వులు.కొబ్బరి వేసి వేపుకోని చల్లారానివ్వండి.
4.ఇప్పుడు మిక్సి జార్ లోకి వెల్లుల్లి రెబ్బలు ,పసుపు,వేపుకున్న ఎండుమిర్చి,మసాల దినుసులు,ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
5.గ్రైండ్ చేసుకున్న మసాలాను బీరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోని మిగిలిన మసాలాను పక్కన పెట్టుకోవాలి.
6.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకోని నూనే వేడి చేసి అందులోకి పచ్చిమర్చి,జీలకర్ర,అవాలు,ఎండుమిర్చి ,కరివేపాకు వేసి వేపుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి స్టఫ్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసి మిక్స్ చేసుకోని మూతపెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి.
8.లోఫ్లేమ్ కలుపుతు మరికాసేపు ఉడికించుకోవాలి.
9.ఇప్పుడు అందులోకి మిగిలిన మసాలా పొడిని వేసి ,కొద్దిగా కొత్తిమీర చల్లుకోని మూత పెట్టుకోని మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
10. అంతే స్పైసీ అండ్ టేస్టీ గుత్తి బీరకాయ కూర రెడీ.

