పెళ్లిళ్లలో కేటరింగ్ వాళ్ళు చేసే ములక్కాడ మసాలా కర్రీ.. ఈ సీక్రెట్ మసాలా వేస్తే రుచి అద్భుతం!
Drumstick Curry Recipe:పెళ్లిళ్లు, ఫంక్షన్లలో భోజనానికి వెళ్లినప్పుడు అక్కడ కేటరింగ్ వాళ్ళు చేసే వంటల రుచే వేరుగా ఉంటుంది. ముఖ్యంగా వారు చేసే ‘ములక్కాడ మసాలా కర్రీ’ (Drumstick Masala Curry) ఆ వాసనకే నోరూరిపోతుంది.
చిక్కటి గ్రేవీతో, మసాలా ఘాటు ములక్కాడ ముక్కలకు పట్టి వేడివేడి అన్నంలో కలుపుకుని తింటుంటే అమృతంలా ఉంటుంది. అయితే మనం ఇంట్లో ఎన్నిసార్లు ములక్కాడ కూర వండినా ఆ కేటరింగ్ స్టైల్ రుచి, ఆ గ్రేవీ టెక్స్చర్ రావడం లేదని చాలామంది అనుకుంటారు.
నిజానికి కేటరింగ్ మాస్టర్లు వాడే ఒక చిన్న సీక్రెట్ మసాలా పేస్ట్తో ఆ అద్భుతమైన రుచిని మనం ఇంట్లోనే చాలా సులభంగా తీసుకురావచ్చు. మరి వేడివేడి అన్నం, బగారా రైస్ లేదా చపాతీల్లోకి అదిరిపోయే ఈ కేటరింగ్ స్టైల్ ములక్కాడ మసాలా కర్రీని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!
మనక్కాడ మసాలా కూర..మునగాకు లాభాలు ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. మునగాకు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మునక్కాయలు – 2
టమాటో పేస్ట్ – 2
ఉల్లిపాయ పేస్ట్ – 1
కారం – 2 టీ స్పూన్స్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి మునక్కాడ ముక్కలను వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
2.అదే ప్యాన్ లో ఉల్లిపాయ పేస్ట్ వేసి లో ఫ్లేమ్ పై వేపుకోవాలి.
3.కారం ,ఉప్పు,జీలకర్రపొడి,ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.
4.తగినన్ని నీళ్లను వేసి పదినిమిషాల పాగు ఉడికించుకోవాలి.
5.గ్రేవిలోకి గరం మసాలా వేసి వేపుకున్న ములక్కాడ ముక్కలను వేసి కలుపుకోవాలి.
6.అంతే రోటి ,రైస్,చపాతికి టేస్టీ టేస్టీ డ్రమ్ స్టిక్స్ మసాలా కర్రీ రెడీ.

