Beauty Tips

వారంలో 2 సార్లు ఇది వాడితే చాలు.. జుట్టు రాలడం ఆగిపోయి ఎంత ఒత్తుగా పెరుగుతుందో తెలుసా?

Alovera Hair Loss Home remedies In telugu : జుట్టు రాలడం, పలచబడటం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ జుట్టు కుదుళ్లను బలంగా మార్చి, హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే అద్భుతమైన న్యాచురల్ రెమెడీ మీకోసం. వారంలో కేవలం రెండు సార్లు ఈ ఇంటి చిట్కాను ఉపయోగించడం వల్ల మీ జుట్టు రాలడం తగ్గి, ఎంత ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనబడుతుంది. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా .చూసుకోవాలి. జుట్టు కుదుళ్ళు బలంగా లేకపోతే జుట్టు రాలిపోతుంది. .
kalabanda beauty
జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రక రకాల ప్రొడక్ట్స్ వైపు చూస్తూ ఉంటారు. అలా వాటిని వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మనం మంచి పోషకాహారం తింటూ ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా తక్కువ సమయంలోనే చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.

జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ఒక సీర‌మ్‌ ను తయారు చేసుకుందాం. దీని కోసం ముందుగా మూడు స్పూన్ల కలోంజి విత్తనాలను మెత్తని పొడిగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి గిన్నెపెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడయ్యాక తయారు చేసి పెట్టుకున్న కలోంచి సీడ్స్ పొడి వేసుకోవాలి. .

నీరు సగం అయ్యేవరకు మరిగించి ఆ నీటిని వడగట్టాలి. ఒక బౌల్ లో మూడు స్పూన్ల అలోవెరా జెల్, కలోంజీ గింజల నీటిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ రోజు వాటర్,నాలుగు చుక్కల పెప్పర్ మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకొని ఒక గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ సీర‌మ్‌ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనలో చాలామంది మార్కెట్లో దొరికే సీర‌మ్‌ లను వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఈ సీర‌మ్‌ ని వాడి చూడండి…అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."