Healthhealth tips in telugu

పైల్స్ సమస్యతో కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారా? ఈ పాతకాలపు చిట్కాతో ఈజీగా చెక్ పెట్టండి!

ఈ రోజుల్లో మారిన ఫుడ్ హ్యాబిట్స్, ఒకే దగ్గర గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల చాలామందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య ‘పైల్స్’ (మొలలు). ఈ సమస్య ఉన్నవాళ్లు పడే నరకం అంతా ఇంతా కాదు. అటు ప్రశాంతంగా ఒకచోట కూర్చోలేరు, ఇటు నిల్చోలేరు.

ముఖ్యంగా ఉదయం పూట మల విసర్జన సమయంలో భరించలేని నొప్పి, రక్తస్రావం, మలద్వారం చుట్టూ వాపు.. ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు కదా!

అయితే, ఈ సమస్యను అస్సలు అశ్రద్ధ చేయకండి. తొలిదశలో ఉన్నప్పుడే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే దీనికి ఈజీగా చెక్ పెట్టొచ్చు. అందులో అద్భుతంగా పనిచేసే ఒక ఆయుర్వేద చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పైల్స్ కి బెస్ట్ మెడిసిన్.. ‘దానిమ్మ తొక్కలు’!
అవునండీ, మీరు విన్నది నిజమే. మనం దానిమ్మ గింజలు తినేసి, తొక్కలను చెత్తబుట్టలో పడేస్తుంటాం కదా.. కానీ ఆ తొక్కల్లోనే పైల్స్ ని తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

దానిమ్మ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో పాటు విటమిన్ సి, బి, ఏ, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి పైల్స్ వాపును, నొప్పిని తగ్గించడంలో సూపర్ గా పనిచేస్తాయి.
danimma tokkalu
మరి ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలి?

దీని తయారీ చాలా సులువు. ఈ కింది స్టెప్స్ ఫాలో అయిపోండి:

ముందుగా దానిమ్మ తొక్కలను ఎండలో బాగా ఎండబెట్టి, మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోండి.

ఇప్పుడు ఆ పొడిలో కొద్దిగా బెల్లం వేసి మరోసారి మిక్సీ పట్టండి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా (గోళీ సైజులో) చుట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి.

ఎలా వాడాలి?
ఈ ఉండలను రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కోటి చొప్పున తీసుకుంటే.. పైల్స్ సమస్య నుంచి చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది. నొప్పి, వాపు క్రమంగా తగ్గిపోతాయి.

ముఖ్య గమనిక : ఈ చిట్కా సమస్య ప్రాథమిక దశలో ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది. కానీ మీ సమస్య మరీ తీవ్రంగా ఉంటే (రక్తస్రావం ఎక్కువగా అవుతుంటే) మాత్రం కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించండి.

డాక్టర్ ఇచ్చే మందులు వాడుతూనే ఈ చిట్కాను కూడా ఫాలో అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఆయుర్వేద చిట్కాలు వాడేముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిదే!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."