Movies

అభిషేకం హీరోయిన్ శిరీష (విష్ణుప్రియ ) గురించి కొన్ని నిజాలు….ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా ?

సీరియల్స్ లో నటించే నటీనటులకు వచ్చే క్రేజ్ వేరు. సీరియల్స్ లో నటించడం వలన నేరుగా బుల్లితెర వీక్షకులకు ప్రతి రోజూ పలకరింపుగా ఉంటుంది. ఇక ఈటీవీలో ప్రసారం అయ్యే అభిషేకం సీరియల్ లో శిరీష గా నటిస్తున్న అమ్మాయి నటన బాగా ఆకట్టుకుంటోంది. శిరీష అసలు పేరు విష్ణు ప్రియ హనుమాన్ జంక్షన్ లో ఆగస్టు 19న జన్మించింది. ఈమెను ముద్దుగా ప్రియ అంటారు. ప్రతి సీరియల్ లో నెగెటివ్ రోల్ చేస్తుంది. నేను కావాలని నెగెటివ్ రోల్స్ చేయడం లేదని , వాళ్ళే ఇస్తున్నారని చెప్పింది. రంగస్థలం అనే షోలో ఈమె డాన్స్ చేస్తుంది. తనతో వర్క్ చేసే తోటి నటులంటే చాల ఇష్టపడే ఈమెకు చాకోలెట్స్ అంటే అసలు ఇష్టం ఉండదట.

విష్ణుప్రియకు బొమ్మరిల్లు సినిమా అంటే చాలా ఇష్టం. రొయ్యల కూర అంటే చాల ఇష్టంగా తింటుందట. బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్సులంటే ఇష్టం. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్,హైపర్ అది కామెడీ అంటే ఈమెకు చాలా ఇష్టం. సూర్య వంశంలో చేసే మైథిలి అంటే ఈమెకు ఇష్టమట. విష్ణుప్రియ కు ప్రస్తుతం 24సంవత్సరాలు. స్మార్ట్ గాళ్ కనిపించే ఈమె తన లైఫ్ గోల్ ఏమిటో ఇంకా డిసైడ్ చేసుకోలేదట. వైజాగ్ సిటీని గ్రీన్ సిటీగా భావిస్తుంది. ఊటీ ఇష్టమైన ప్రదేశం అని చెబుతుంది. ఈమె సీరియల్స్ ని స్విట్జర్లాండ్ దేశంలో ఎక్కువగా వీక్షిస్తున్నారట.

పిల్లా నువ్వులేని జీవితం,మిస్టర్ పెళ్ళికొడుకు,రభస,రొమాన్స్,రామయ్య వస్తాడయ్యా,బలుపు, వంటి సినిమాల్లో నటించింది. విష్ణుప్రియ సోదరుడు రాజేష్. తల్లి పేరు లక్ష్మి,తండ్రి పేరు శ్రీనివాస్. రక్త సంబంధం సీరియల్ లో నటిస్తున్న సిద్దార్ధ్ వర్మను విష్ణు ప్రియ ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త కర్లింగ్ హెయిర్ అంటే ఈమెకు చాలా ఇష్టం. అలాగే చికెన్ ఫ్రై అంటే భర్తకు చాలా ఇష్టమని చెబుతోంది.

ఆమె కుడిచేతికి పచ్చబొట్టు కూడా సిద్దు అని పొడిపించుకుంది. నిజానికి సిద్ధూ చిన్నప్పటినుంచి ఫ్రెండ్ కావడం వలన అది ప్రేమగా మారింది. తన సీరియల్స్ విషయాలు భర్తతో షేర్ చేసుకుంటుంది. అతడు కూడా తన సీరియల్స్ విషయాలు షేర్ చేసుకుంటాడు. విష్ణుప్రియ తమిళం చక్కగా మాట్లాడుతుంది. కుంకుమ పువ్వు,నువ్వేకావాలి,అభిషేకం, ఇద్దరమ్మాయిలు, వంటి సీరియల్స్ లో చేస్తోంది.

ఇక తనకు ఫేస్ బుక్ ఖాతా లేదని, ఒకవేళ ఎవరైనా పేక్ ఎక్కౌంట్ క్రియేట్ చేస్తే చూసి మోస పోవద్దని చెబుతోంది. ముద్దమందారం సీరియల్ లో నటిస్తున్న నీలాంబరి ఈమెకు మంచి ఫ్రెండ్. నీలాంబరిని రౌడీ బేబీ అని పిలుస్తుంది.