Movies

చిరు Vs రాజశేఖర్…ఎంత పెద్ద గొడవ జరిగిందో చూడండి

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఆర్టిస్టుల అసోసేషియన్ అందరికి కలగలిపి “మా” ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఎప్పటి నుంచో ఉన్న అసోసేషియన్ కు సంబంధించి డైరీ ఫంక్షన్ ను ఈ రోజు హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ టాలీవుడ్ కు చెందిన అగ్ర శ్రేణి నటుల సమక్షంలో జరుగుతుండగా ఆ మీటింగులో కాస్త రసాభాస చోటు చేసుకుంది.

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చిన ఈ చిన్న పాటి ఫంక్షన్ లో సీనియర్ నటుడు మరియు మా అసోసేషియన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజశేఖర్ కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.అయితే గత కొంత కాలం నుంచి వీరిలో వీరికే చిన్న కోల్డ్ వార్ జరుగుతుంది అని అందరికీ తెలుసు.కానీ అది ఈ రోజు మాత్రం మరింత తీవ్ర రూపం దాల్చింది అని చెప్పాలి.

రాజశేఖర్ మాట్లాడుతూ తన సర్వస్వం ఈ మా అసోసేషియన్ వలనే పోయింది అన్నట్టుగా అలాగే ఇటీవలే తనకు జరిగిన కార్ ప్రమాదానికి కూడా కారణం ఇదే అంటూ చేసిన వ్యాఖ్యలు స్టేజి పై ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరియు మోహన్ బాబులకు ఆగ్రహాన్ని తెల్పించాయి.దీనితో చిరు కూడా మైక్ తీసుకొని కాస్త ఆగ్రహంగానే తన వెర్షన్ ను వినిపించారు.

సంతోషకరమైన వార్తలు అయితే నలుగురితో చెప్పుకోవాలని అలాగే లోలోపల ఏమన్నా గొడవలు ఉంటే నాలుగు గోడల మధ్య మనం చర్చించుకోవాలి అని ఇదంతా ఏదో ప్రీ ప్లాన్డ్ గా వచ్చినట్టున్నారని చిరు రాజశేఖర్ పై అసహనం వ్యక్తం చేసారు.దీనితో ఒక్కసారిగా అక్కడ కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."