Healthhealth tips in telugu

కరోనా సమయంలో కిస్ మిస్ తింటే…ఊహించని లాభాలు

Kismis Benefits in telugu :కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది.కరోనా వాక్సిన్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా ఉండటంతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అందువల్ల కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ  శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతిరోజు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. కిస్ మిస్  తీసుకుంటే శరీరంలో ఇమ్యునిటీ పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కిస్ మిస్ ని  రెగ్యులర్గా తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

కరోనా సమయంలో చాలామంది గొంతునొప్పితో బాధపడుతున్నారు. అలాంటి వారు వేడి నీటిలో కిస్ మిస్ ను నానబెట్టి తీసుకుంటే గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. లివర్ సమస్యలు రక్తహీనత సమస్య ఉన్నవారు కిస్ మిస్  తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే  నీరసం నిస్సత్తువ ఉన్నప్పుడు కూడా కిస్ మిస్ తింటే  తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే రక్తపోటు అదుపులో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి. కిస్ మిస్ కూడా అందరికీ అందుబాటులోనే ఉంటాయి.