Beauty TipsHealth

Hair Fall Tips: జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. మీ ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా చేయండి

Rice Hair fall Tips In Telugu :జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తోంది.జుట్టు పొడవుగా పెరగడానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది. ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రీడెంట్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.

ముఖం అందంగా ఉండాలి అంటే జుట్టు కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే ఆ అందమే వేరు కాబట్టి ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు. ఈ రెమిడీ చేయటం చాలా సులువు. కాస్త సమయం,శ్రద్ద పెడితే సరిపోతుంది.
Diabetes tips in telugu
ఈ రెమిడీ కోసం ఒక బౌల్ లేదా ఒక గాజు సీసాలో 3 స్పూన్ల బియ్యం, 5 లవంగాలను వేసి నీటిని పోసి మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తలకు పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
hair fall tips in telugu
ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బియ్యం నీరు జుట్టుకి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. లవంగాలులో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."