పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే అద్భుతమైన మ్యాజిక్ డ్రింక్
Weight Loss Home Remedies in telugu : అధిక బరువు, పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వు కరిగించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయిన వారికి ఈ డ్రింక్ బాగా సహాయపడుతుంది. కాస్త శ్రద్ద, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. దీని కోసం ఒక పొడి తయారుచేసుకోవాలి. ఈ పొడి కోసం సొంపు, జీలకర్ర, వాము తీసుకోవాలి. ఇవి వంటింటిలో సులభంగా దొరికేవే.

ఒక కప్పు సొంపు, ఒక కప్పు జీలకర్ర, ఒక కప్పు వాము తీసుకొని వేగించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక తయారుచేసి పెట్టుకున్న పొడిని ఒక స్పూన్ వేయాలి.

5 నుంచి 7 నిమిషాలు మరిగాక ఈ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. డయబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ డ్రింక్ ని పరగడుపున 15 రోజులు తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. జీలకర్ర, సొంపు, వాములో ఉన్న పోషకాలు బరువు తగ్గించటానికి సహాయపడతాయి.

ఎప్పుడైనా బరువు అనేది ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గాలి. ఒక్కసారిగా పెరిగిపోకూడదు. ఒక్కసారిగా తగ్గిపోకూడదు. మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం లేదా యోగా చేస్తూ ఈ డ్రింక్ తాగితే తప్పకుండా అధిక బరువు మరియు శరీరంలో పెరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఈ డ్రింక్ ని ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు.

మనలో చాలా మంది బరువు పెరగగానే చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా తయారుచేసుకున్న ఈ పొడిని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గుతారు. కాబట్టి ఈ డ్రింక్ ని ట్రై చేసి బరువు సమస్య నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

