టాబ్లెట్ కంటే స్పీడ్ గా గ్యాస్ ట్రబుల్ ని తగ్గించే డ్రింక్…కడుపు ఉబ్బరం,అజీర్ణం అన్నీ తగ్గిపోతాయి
Home remedies for gastric problem in telugu : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. చలికాలంలో సహజంగానే మనకు తిన్న ఆహారం జీర్ణమవడంలో ఇబ్బందులు కలుగుతాయి. కొందరికి ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఇక కొందరికైతే అసలు జీర్ణం కాదు. దాంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

అలాంటి వారు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంటిలో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే అజీర్ణం సమస్యకు చెక్ పెట్టవచ్చు. వాటిని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. ఇతర జీర్ణ సమస్యలు కూడా పోతాయి. అది ఏమిటంటే…మనం ప్రతి రోజు ఏదో ఒక రకంగా వాడే వాము. వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పావు స్పూన్ వాములో చిటికెడు ఉప్పు వేసి నములుతూ ఆ రసాన్ని మింగవచ్చు. లేదా గోరువెచ్చని నీటిలో వాము వేసి బాగా కలిపి తినవచ్చు. లేదా వాము గింజలను నీటిలో వేసి మరిగించాలి. నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఈ నీటిని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.
ఈ నీటిని తాగటం వలన జీర్ణ సంబంద సమస్యలు తగ్గటమే కాకుండా డయబెటిస్ ఉన్న వారు, అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు, రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారికి చాలా సహాయపడుతుంది. ఈ డ్రింక్ ని తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

