దాల్చిన చెక్క+వెల్లుల్లి కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?
Garlic and cinnamon : దాల్చిన చెక్క, వెల్లుల్లి రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని కలిపి తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే.

అలా మందులు వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే డయాబెటిస్ నియంత్రణలో ఉండి వేసుకొనే మందుల మోతాదు పెరగకుండా ఉంటుంది. వెల్లుల్లిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అలాగే విటమిన్ బి6, విటమిన్ సి అనేవి డయాబెటిస్ నియంత్రణలో సహాయపడతాయి. కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తాయి.
ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో దాల్చినచెక్క కూడా సహాయపడుతుంది. దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి డయాబెటిస్ నియంత్రణకు అనువైనవి. దాల్చిన చెక్క, వెల్లుల్లి తో టీ తయారుచేసుకొని ఉదయం సమయంలో తాగితే సరిపోతుంది. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి ఒక నిమిషం మరిగించాలి.
ఆ తర్వాత రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి క్రష్ చేసి వేసి మరో మూడు నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఈ విధంగా తాగటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

