Healthhealth tips in telugu

15 రోజులు ఈ టీ తాగితే Joint Pains,వెన్నునొప్పి,అధిక బరువు అన్ని మాయం అవుతాయి

Joint pains home remedies in telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మందులను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలా కాకుండా సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ప్రయోజనం కలుగుతుంది.

సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఇంటి చిట్కాలను ఫాలో అవుతూ డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. డాక్టర్ సూచనలు కూడా తప్పనిసరిగా పాటించాలి. ఈ రోజుల్లో వచ్చే కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్,అధిక బరువు వంటి సమస్యలు అన్ని తొలగిపోతాయి.

ఈ చిట్కా కోసం కేవలం రెండే రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. వాము, కలోంజీ విత్తనాలు ఈ రెండింటిని ఈ చిట్కా కోసం ఉపయోగి స్తున్నారు. ఒక గ్లాస్ నీటిలో పావు స్పూన్ వాము,పావు స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన వాము కలోంజి విత్తనాలు తింటూ ఆ నీటిని తాగాలి.
Joint Pains
మరోవిధంగా కూడా వీటిని తీసుకోవచ్చు ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి పావు స్పూను వాము విత్తనాలు, పావు స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించి వడగట్టి ఆ నీటిని తాగాలి. ఈ నీటిలో తేనె కూడా కలుపుకోవచ్చు అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Weight Loss tips in telugu
మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నప్పుడూ విపరీతమైన బాధ ఉంటుంది. ఈ నొప్పులను తగ్గించుకోవటానికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయ పడుతుంది. వాము, కలోంజీ విత్తనాలు రెండు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి అధిక బరువును తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."