హై బీపీ ఉన్నవారు ఈ జ్యూస్ తాగితే జీవితంలో అధిక రక్తపోటు అనేది ఉండదు
BeetRoot Juice For High Blood Pressure : అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక ఒత్తిడి వల్ల వచ్చే ప్రధాన వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే, గుండె సమస్యలు మరియు ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.

అలా మందులు వాడుతూ రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. బీట్‌రూట్ సహజమైన నైట్రేట్‌లను కలిగి ఉంటుంది.

ఇది శరీరంలోకి వెళ్లి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. దాని సహాయంతో, రక్తాన్ని సరఫరా చేసే సిరలు రిలాక్స్ అయ్యి రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. బీట్ రూట్ లో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్‌లు రక్త ధమనులను తెరుచుకునేలా చేస్తాయి. ఇది రక్త ప్రవాహానికి సహాయపడి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. బీట్‌రూట్ (Beetroot ) లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గిస్తాయి, అయితే B విటమిన్లు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి.

ఇది బలమైన హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాక, ఇనుము మరియు యాంటీఆక్సిడెంట్ల కలయిక రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది, దాంతో ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. బీట్ రూట్ జ్యూస్ ఏ సమయంలో తాగితే మంచిది అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి.

బీట్ రూట్ జ్యూస్ ని రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్ ఫాస్ట్ కి గంట ముందు బీట్ జ్యూస్ తాగడం వల్ల పూర్తి ప్రయోజనం పొందవచ్చు. ఉదయం సమయంలో తాగటం వలన రోజంతా అలసట,నీరసం లేకుండా హుషారుగా ఉంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

