Beauty TipsHealthhealth tips in telugu

Hair Care Tips:కేవలం రూ.10 ఖర్చుతో ఇలా 4 సార్లు చేస్తే చాలు.. చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు

Curd and lemon Dandruff Home remedies in telugu : తలలో చుండ్రు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తలలో దురద, మంట వచ్చి చాలా చిరాకు వస్తుంది. అంతేకాకుండా చుండ్రు కారణంగా జుట్టు బలహీనంగా మారి జుట్టు రాలిపోతుంది. చుండ్రు సమస్య అనేది సాధారణమే.. అయినా సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.

మనలో చాలామంది చుండ్రు సమస్య కనబడగానే మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు, షాంపూలను వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన వంటింట్లో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో చాలా సులభంగా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. చుండ్రు సమస్య నుంచి సులభంగా బయటపడటానికి పెరుగు,నిమ్మరసం చాలా బాగా సహాయపడతాయి.

ఒక కప్పు పెరుగులో అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే కేవలం రెండు వారాల్లోనే చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు.

పెరుగులో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది వెంట్రుకల రూట్స్‌ నుంచి చుండ్రును తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌లను తొలగించడానికి సహాయపడతాయి. పెరుగు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది.

అయితే నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టును రూట్ నుంచి బలంగా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి చుండ్రు, జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండి. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.