Beauty Tips

White Hair:తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

White Hair Turn Black Home Remedies:ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

కొబ్బరి నూనె,ఉసిరి రెండూ కూడా తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా బాగా సహాయపడతాయి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి 150 Ml కొబ్బరి నూనెను పోసి దానిలో 12 ఎండు ఉసిరికాయ ముక్కలను వేసి ముక్కలు బాగా ఉడికే వరకు మరిగించాలి. ఈ నూనె చల్లారక వడకట్టి ఓ గాజు సీసాలో నిల్వ చేయాలి.

ఈ నూనెను ప్రతి రోజు రాసుకుంటూ ఉంటె తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఎండిన ఉసిరి ముక్కలు మార్కెట్ లో లభ్యం అవుతాయి. లేదంటే ఉసిరికాయల సీజన్ లో కాయలను ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి.

తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టుకు అవసరమైన పోషణ కూడా లభిస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."