Healthhealth tips in telugu

Remedies for Cough: ఈ సీజన్ లో దగ్గు, గొంతునొప్పి ఇబ్బంది పెడుతున్నాయా? ఇవిగో చిట్కాలు!

Remedies for Cough and Sore Throat: ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దగ్గు,జలుబు వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి. దగ్గు జలుబు తగ్గాలంటే మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చిట్కాలను ఫాలో అవ్వాలి.

సాధారణంగా మనం వాతావరణ కాలుష్యం ప్రభావం వల్ల గానీ,సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల గానీ, పని ఒత్తిడి వల్లగానీ ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.ప్రతి ఆరోగ్య సమస్యకు మందులు వాడడం వలన అనేక రకములైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

అలాకాకుండా మనకు ప్రకృతిలో దొరికే సహజసిద్దమైన మన ఇంట్లోనే లభించే కొన్ని పదార్దాలను ఉపయోగించి ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు.ఆ చిట్కాలేమిటో చూద్దాం.దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయం మూడు కప్పుల నీళ్లల్లో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి సగం అయ్యేవరకు నీటిని మరిగించి అందులో ఒక టీస్పూను తేనె కలుపుకుని తాగాలి.

దగ్గు నుండి ఉపశమనానికి తులసి ఆకులను తేనెతో కలిపి పరగడుపున తీసుకోవాలి. దానిమ్మ తొక్కలను పొడి చేసి ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూను పొడి కలిపి తీసుకుంటే రక్త శుద్ది జరుగుతుంది. తులసిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన మరియు తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఉండుట వలన దగ్గు నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది.

ఉప్పు నీరు ఒక యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ ద్రావణంగా పనిచేసి శ్లేష్మం క్లియర్ చేయటానికి సహాయపడి గొంతు అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పును కలిపి, ఆ నీటితో రోజులో కనీసం రెండుసార్లు గొంతును గరగరలాడించండి. ఈ విధంగా సెహ్స్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News