Healthhealth tips in telugu

Turmeric Lemon Water : రోజూ నిమ్మరసంలో పసుపు కలిపి తాగితే అద్భుతాలు

Turmeric Lemon Water : రోజూ నిమ్మరసంలో పసుపు కలిపి తాగితే అద్భుతాలు..పసుపు,నిమ్మరసం రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.

పసుపులో ఉండే కర్కుమిన్ నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ రెండు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి మెదడుకు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించి అల్జీమర్స్ ప్రమాదాన్ని నివారిస్తాయి.

ఒత్తిడి,అలసట,నిస్సత్తువ, ఆందోళన వంటి వాటిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కాలేయంను ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా కాలేయం పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి మరియు కర్కుమిన్ రెండూ కూడా గాయాలను నయం చేయటంలో సహాయపడతాయి.

శరీరంలో మంటను తగ్గిస్తుంది. కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. శరీరంలో జీవక్రియలను మెరుగుపరచి తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం, పావుస్పూన్ లో సగం పసుపు వేసి బాగా కలిపి తాగాలి.

ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున తాగకూడదు. పసుపు,నిమ్మరసం కలిపిన నీటిని 15 రోజులు తాగితే ఆ తేడా చూసి మీకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."